పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భోజన విరామం ప్రకటించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పార్టీల నేతలు తీర్మానంపై మాట్లాడారు.
'లౌకిక, ప్రజాస్వామ్యవాదులు సీఏఏపై తమ తమ పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నాయి. సీఏఏ చట్టం దేశవ్యాప్తంగా అనుమానాలకు ఆందోళనలకు దారితీసింది. సీఏఏపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలి. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నాం. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్ష చేసుకోవాలి. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తాం. సీఏఏపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి.. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నామని' సీఎం కేసీఆర్ కోరారు.