ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, అడిషనల్ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులకు పలు అంశాలపై దిశానిర్డేశం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను అమలు చేయడమే జిల్లా అధికార యంత్రాంగం ప్రాధాన్యం అయి ఉండాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎవరికి వ్యతిగత ప్రాధాన్యతలు ఉండరాదు. అనేక రకాల చర్చోపచర్చలు, నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాం. సంక్షేమరంగంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. రూ.4 వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉండేది. చాలా తక్కువ సమయంలోనే విద్యుత్ సమస్యలు అధిగమించాం. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం.
ప్రభుత్వ అధికారాలన్నీ కలెక్టర్లకు ఇస్తున్నాం: సీఎం కేసీఆర్